దొంగని దొంగా అంటే.. ఉలుకెందుకు ‘దోపిడికుంట’ శ్రీధ‌ర్ రెడ్డి గారూ?: నారా లోకేశ్ మండిపాటు

  • టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణతో రణరంగంలా పుట్టపర్తి
  • రఘునాథరెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న లోకేశ్
  • వైసీపీ శ్రేణులు దాడి చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన టీడీపీ నేత
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మధ్య సవాళ్లతో ఈ రోజు పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణతో పుట్టపర్తి పట్టణం రణరంగంగా మారింది. రెండు వర్గాల కార్యకర్తలను లాఠీచార్జ్ చేసి పోలీసులు చెదరగొట్టారు. 

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కారుపై నిలబడి ఉండగా.. వైసీపీ నేతలు రాళ్లు, చెప్పులు రువ్విన వీడియోలు వైరల్ అయ్యాయి. ఓ వ్యక్తి రఘునాథరెడ్డిపై దాడి చేసేందుకు దూసుకెళ్లడం కనిపించింది. ఈ దాడిలో రఘునాథరెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ వ్యవహారంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. రఘునాథరెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వైసీపీ శ్రేణులు దాడి చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. 

‘‘ఉన్న‌మాట అంటే ఉలుకెందుకు పుట్ట‌ప‌ర్తి ఎమ్మెల్యే దోపిడికుంట శ్రీధ‌ర్ రెడ్డి గారూ! దొంగ‌ల‌ని దొంగా అన్నామ‌ని పుట్ట‌ప‌ర్తిలో టీడీపీ శ్రేణులపై, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారిపై దాడుల‌కు దిగారు వైసీపీ గూండాలు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. ‘వైఎస్సార్ సీపీ రౌడీయిజం’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.

Nara Lokesh
Sridhar Reddy
puttaparti MLA
palle raghunatha reddy
YSRCP
TDP

More Telugu News